Thursday, March 17, 2011

కర్తవ్యం

ప్రేమించు ప్రేమించు
దేశాన్ని ప్రేమించు
మంచితనము పెంచు
మానవతను పంచు //ప్రేమించు//

ఒకరినొకరు చంపుకొనే
నీతిని ఖండించు
అందరూ నా వారను
భావన కలిగించు
మనసులు ఒకటయితే
మతములేల విభజించు
అసూయా ద్వేషాలను
మొక్కలోనె తుంచు
చేయి చేయి కలుపు
ప్రగతిని సాధించు
చెమటోడ్చి పనిచేసి
రతనాలను పండించు
అందరికీ సరిపడా
పాడిపంటలందించు //ప్రేమించు//

ఇరుగు పొరుగువారితో
ప్రేమతో వ్యవహరించు
ఎంత ఎత్తు ఎదిగినా
వినయంతో పలకరించు
ప్రగల్బాలు మానుకొని
చెప్పింది చేసి చూపించు
ఆపదలో ఉన్న వారిని
కరుణతో ఆదరించు
స్వార్ధాన్ని చంపుకొని
దేశభక్తి పెంపొందించు
అలసత్వం వదిలిపెట్టి
ముందుకు పయనించు
ప్రపంచాభివృద్ధిలో
దేశాన్ని ముందుంచు //ప్రేమించు//

6 comments:

  1. మీ పూఁదోఁట చాలా బాగుంది. పాత పాటలన్నీ చూశాను. అన్నీ బాగున్నాయి.
    అభినందనలు.

    ReplyDelete
  2. మందాకిని గారూ, మెనీ మెనీ థాంక్స్‌.

    ReplyDelete
  3. పద్మార్పిత గారికి చాలా ధన్యవాదాలు..

    ReplyDelete