Thursday, March 31, 2011

నన్ను ప్రేమించొద్దు


వద్దు వద్దు వద్దు
నన్ను ప్రేమించొద్దు
వద్దు వద్దు వద్దు
నాతో మాటాడొద్దు //వద్దు వద్దు//

దొంగ చాటుగా గోడ దూకి
నన్ను కలవద్దు
కిటికీలోంచి సైగలు చేస్తూ
నన్ను పిలవొద్దు
దూరం నుంచే ఎగిరే ముద్దు
నాకు ఇవ్వద్దు
మారువేషంలో నాగదికొచ్చి
అల్లరి పెట్టొద్దు
తియ్యతియ్యని కబుర్లన్నీ
నాకు చెప్పొద్దు //వద్దు వద్దు//

ఫ్రెండునంటూ గొంతు మార్చి
ఫోన్లు చెయ్యొద్దు
ప్రేమలేఖలు తమ్ముడిచేత
అసలే పంపొద్దు
ప్రతి ఉదయం సందుచివర
కాపల కాయొద్దు
సాయంత్రం చెరువుగట్టున
ఎదురు చూడొద్దు
నన్ను కలిసిన ప్రతిసారీ
తీయని ముద్దు ఇవ్వనే ఇవ్వద్దు//వద్దు వద్దు//

4 comments:

  1. ANNII CHAALAA BAAGUNNAAYI SRINIVAS GAARU

    INKAA CHADUVUTUNEE...UNNAANU:)

    ReplyDelete
  2. srinath kanna garu, chaalaa chaalaa thanksandee...

    ReplyDelete
  3. ఆడవారి మాటలకు అర్థాలు వేరులే...
    అర్థాలే వేరులే...అర్ధాలే వేరులే.....:))

    ReplyDelete
  4. Sudha గారు..చాలా కరెక్ట్‌గా అర్థం చేసుకున్నారు..థాంక్యూ..!

    ReplyDelete